Pages

భగవద్గీత విభాగాలు

భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క "యోగము" అని చెబుతారు. వీటిలో 1నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి "కర్మషట్కము" అని అంటారు. 7 నుండి 12 వరకు అధ్యాయాలను "భక్తి షట్కము" అని అంటారు. 13 నుండి "జ్ఞాన షట్కము". ఒక్కొక్క యోగంలోని ప్రధాన విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.


అర్జునవిషాద యోగము

"ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రంలో నావారు, పాండుపుత్రులు ఏమి చేశారు సంజయా?" అనే ధృతరాష్ట్రుని ప్రశ్నతో ఈ యోగం మొదలవుతుంది. తరువాత సంజయుడు అక్కడ జరిగినదంతా చెబుతాడు. మొదట ఇరు పక్షాల సేనలను సంజయుడు వర్ణిస్తాడు. అర్జునుని కోరికపై పార్ధసారధియైన కృష్ణుడు ఉభయసేనల మధ్య రధాన్ని నిలిపాడు. అర్జునుడు కురుక్షేత్రంలో మొహరించి యున్నసేనలను చూశాడు. ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన బంధు, గురు,మిత్రులను చూశాడు. - వీరందరినీ చంపుకొని రాజ్యం పొందడమా? అని మనసు వికలం అయ్యింది. కృష్ణా! నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు. నేను యుద్ధం చేయను. నాకు ఏమీ తోచడం లేదు. కర్తవ్యాన్ని బోధించు - అని ప్రార్ధించాడు.

సాంఖ్య యోగము

సాంఖ్యము అనగా ఆత్మానాత్మ వివేచన. కర్తవ్య విమూఢుడైన అర్జునుని కృష్ణుడు మందలించాడు. తరువాత అర్జునునికి ఆత్మ తత్వాన్ని బోధించాడు. తానే చంపేవాడినన్న భ్రమ వద్దని తెలిపాడు. ఇది గీతలోని తత్వం విశదపరచిన ప్రధానాధ్యాయం. దీనిని సంక్షిప్త గీత అని కూడా అంటారు. శరీరానికి, ఆత్మకు ఉన్న భేదాన్ని భగవంతుడు వివరించాడు. ఆత్మ శాశ్వతమని, దానికి మరణం లేదని, ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతుందని వివరించాడు. దానికి శీతోష్ణ సుఖదుఃఖాలవంటి ద్వంద్వాలు లేవు. ఇంద్రియాలకు విషయ సంపర్కం వలన ద్వంద్వానుభవాలు కలుగుతుంటాయి. సుఖ దుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు వంటి ద్వంద్వ విషయాలపట్ల సమబుద్ధిని కలిగి ఫలాపేక్ష రహితంగా కర్మలు చేయాలి. సుఖము పట్ల అనురాగము, దుఃఖము పట్ల ఉద్విగ్నము లేకుండా కర్మలు చేసేవాడు, ఇంద్రియాలను వశంలో ఉంచుకునేవాడు, అహంకార మమకారాములు వీడినవాడు, బుద్ధిని ఆత్మయందే లగ్నము చేసినవాడు స్థితప్రజ్ఞుడు.

కర్మ యోగము

కర్మలన్నింటినీ ఆవరిచుకొని కొంత దోషం ఉంటుంది. అలాగని కర్మలు చేయకుండా జీవనం సాధ్యం కాదు. కర్మలవలన సంభవించిన బంధమే జీవుడిని జనన మరణ చక్రబంధంలో కట్టివేస్తుంది. అయితే అహంభావాన్ని, ఫలవాంఛను వీడి కర్మలను ఆచరిస్తే కర్మ బంధాలనుండి విముక్తులు కావచ్చును. అందువలన
  1. యుక్తమైన కర్మలు చేస్తూనే ఉండాలి. వాటి ఫలితాన్ని గురించి ఆశించరాదు. అలాగని కర్మలు చేయడం మానరాదు. ఫలితం ప్రియమైనా, అప్రియమైనా గాని దానిని సమబుద్ధితో స్వీకరించాలి.
  2. కర్మల పట్ల సంగము (ఆసక్తి, వ్యామోహం) పెంచుకోకూడదు. కార్యం సిద్ధించినా సిద్ధింపకున్నా గాని సమభావం కలిగి ఉండాలి. ఫలాపేక్ష లేకుండా చేసేదే నిష్కామ కర్మ. ఫలాపేక్షతో చేసే కామ్యకర్మలు నీచమైనవి.
  3. లోక కళ్యాణం కోసం చేసే కర్మలు భగవంతునికి ప్రీతికరమైనవి. ఇవి బంధం కలిగించవు. మోక్షప్రదాలు.
ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మ పవిత్రమైన యజ్ఞం వంటిది. ఇదే కర్మ యోగము.

జ్ఞాన యోగము

ఆత్మను, పరమాత్ముని గురించిన జ్ఞానమే మోక్షప్రదము. అది నిష్కామ కర్మ వలన లభిస్తుంది. నిష్కామ కర్మ వలన శుద్ధమైన చిత్తం జ్ఞానోదయానికి సరైన క్షేత్రం. ఈ పరమ జ్ఞానాన్ని పురాతనకాలంలో సూర్యునకు భగవంతుడు ఉపదేశించాడు. లోకంలో ధర్మాన్ని రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి యుగయుగమున భగవంతుడు అవతరిస్తాడు. ఈ అధ్యాయంలో కృష్ణుడు తన పరమాత్మ తత్వాన్ని ఇలా బోధించాడు -

" ధర్మానికి హాని కలిగి ఆదర్మం పెచ్చుమీరినపుడు నేను సాధుసంరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం, ధర్మ పునస్థాపన కోసం ప్రతియుగంలోనూ అవతరిస్తుంటాను. నేను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను, జనన మరణ రహితుడను అయినా గాని నా మాయాశక్తిచే నన్ను నేను సృజించుకొంటుంటాను. మానవులు నన్ను ఏవిధంగా ఆరాధిస్తారో ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తుంటాను. రాగ భయ క్రోధాదులను త్యజించి నన్నే ధ్యానించేవారు నన్ను పొందుతారు. కర్మ ఫలాసక్తిని విడచి, నిత్య తృప్తుడై, అహంకార మమకారాలను పరిత్యజించి, సుఖదుఃఖాలకు అతీతుడైన, సమదృష్టి కలిగిన, త్యాగబుద్ధి కలిగిన సాధకునికి జ్ఞానం సులభంగా లభిస్తుంది. జ్ఞానంతో సమానమైన పావనకరమింకొకటి లేదు. ఇంద్రి నిగ్రహము, శ్రద్ధ కలిగి, ఆత్మ ధ్యానం చేసే సాధకునికి పరమశాంతిని ప్రసాదించే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, సంశయాత్ముడు ఇహపరలోకాలలోనూ శాంతిని పొందలేడు."

కర్మసన్యాస యోగము

ఇంతకూ కర్మను చేయాలా? త్యజించాలా? అని అర్జునుడి సందేహం. అందుకు కృష్ణుడు చెప్పిన సమాధానం - "కర్మ చేయకుండా ఉండడం కర్మ సన్యాసం కాదు. నిష్కామ కర్మ ఆచరిస్తూ, కర్మ ఫలాలను త్యజించడం వలన జ్ఞానియైనవాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ సాధన ధ్యానయోగానికి దారి తీస్తుంది. ఫలాసక్తిని విడచి, బ్రహ్మార్పణ బుద్ధితో కర్మ చేసే సన్యాసికి సర్వమూ బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఈ సమత్వమే బ్రహ్మజ్ఞానానికి అత్యవసరం. ఎల్లపుడూ చేయదగిన కర్మను సంగరహితంగా చేసిన మానవుడు పరమపదాన్ని పొందుతాడు"

ఆత్మసంయమ యోగము

ఈ అధ్యాయంలో వివిధ యోగసాధనా విధానాలు చెప్పబడ్డాయి. ఇంద్రియ మనో బుద్ధులను అదుపులో ఉంచుకొని ధ్యానంలో మనసు నిలుపుకోవాలి. ఇది సులభం కాదు. ఈ ప్రయత్నంలో ఎవరిని వారే నిగ్రహించుకొని ఉద్ధరించుకోవాలి. ధ్యానం సరిగా సాగాలంటే ఆహారం, నిద్ర, వినోదం, సౌఖ్యం వంటి విషయాలలో సంయమనం పాటించాలి. అతి ఎక్కడా కూడదు. మనస్సు చంచలం కనుక అది చెదిరిపోతూ ఉంటుంది. అభ్యాసం, వైరాగ్యం అనే బలమైన సాధనల ద్వారా మనసును నిగ్రహించుకొనవచ్చును. ధ్యానానికి అంతరాయం కలిగే సంకల్పాలను దూరంగా ఉంచాలి. సమస్త ప్రాణుల సుఖదుఃఖాలనూ తనవిగా తలచి వాటిపట్ల దయ, కరుణ, ఆర్ద్రత, సహాయత చూపాలి. ఒకవేళ యోగసాధన మధ్యలో ఆగిపోయినా దాని ఫలితం వలన ముందుజన్మలో జీవుడు యోగోన్ముఖుడై గమ్యాన్ని చేరగలడు.

జ్ఞానవిజ్ఞాన యోగము

విజ్ఞానము అనగా అనుభవ జ్ఞానం. ఈ అధ్యాయంలో భగవంతుని తత్వం గూర్చిన జ్ఞానం, ఆయన స్వరూపము, మాయ, సర్వాంతర్యామిత్వం పరిచయం చేయబడినాయి. ఆయనకు శరణుజొచ్చుట మాత్రమే సరయిన భక్తిమార్గం. వారికే ఆయన కరుణ లభిస్తుంది. వేలాదిలో ఏ ఒక్కడో మోక్షసిద్ధికై ప్రయత్నిస్తాడు. వారిలో ఏఒక్కడో భగవంతుని తెలుసుకోగలుగుతాడు.

భగవంతుని ప్రకృతి (మాయ) మనస్సు, బుద్ధి, అహంకారము, పంచభూతములు అనే ఎనిమిది తత్వాలుగా విభజింపబడింది. ఇది అపరా ప్రకృతి. ఇంతకంటె ఉత్తమమైనది పరాప్రకృతి భగవంతుని చైతన్యము. ఈ రెండింటి సంయోగం వలన సృష్టి జరుగుతుంది. మణిహారంలో సూత్రంలాగా భగవంతుడు విశ్వమంతటా వ్యాపించియున్నాడు. భగవంతుకంటె వేరుగా ఏదీ లేదు.

ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అనే నాలుగు విధాలైన భక్తులు భగవంతుని ఆరాధిస్తారు. వారిలో జ్ఞాని సర్వమూ వాసుదేవమయమని తెలుసుకొని కొలుస్తృఆడు గనుక అతడు భగవంతునికి ప్రియతముడు. అనేక దేవతల రూపాలలో భగవంతుని ఆరాధించే భక్తులను ఆయా దేవతలస్వరూపంలో వాసుదేవుడు అనుగ్రహిస్తాడు. దేవతలనారాధించేవారు దేవతలను, సర్వేశ్వరుని ఆరాధించేవారు సర్వేశ్వరుని పొందుతారు. జన్న జరా మరణాలనుండి మోక్షాన్ని పొందగోరినవారు దేవదేవుని (వాసుదేవుని) ఆశ్రయించి, సమస్తమూ ఆ బ్రహ్మమే అని తెలుసుకొని బ్రహ్మమును పొందుతారు.

అక్షరపరబ్రహ్మ యోగము

బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మ, అధిభూతము, అధిదైవము అనే విషయాల వివరణ ఈ అధ్యాయంలో చెప్పబడింది. నిత్యమైన, సత్యమైన పరమ పదము, పరబ్రహ్మము గూర్చి చెప్పబడినది.

క్షరము అనగా నశించునది. నాశరహితమైన పరబ్రహ్మమే అక్షరము. జన్మరాహిత్యం గురించి బోధించేది ఆత్యమ విద్య. అంత్యకాలంలో భగవంతుని ధ్యానిస్తూ దే్హాన్ని త్యజించేవాడు నిస్సందేహంగా పరబ్రహ్మమును చేరుకొంటాడు. ఓంకారాన్ని ఉచ్ఛరిస్తూ దేహాన్ని విడచేవాడు పరమపదాన్ని పొందుతాడు. అన్య చింతన లేకుండా నిశ్చల మనస్సుతో సదా స్మరణ చేసేవానికి ఇది సాధ్యమౌతుంది. అలా భగవంతుని పొందినవానికి పునర్జన్మ లేదు. బ్రహ్మ చేసిన సృష్టి మరల బ్రహ్మకు రాత్రి కాగానే లయిస్తుంది. సమస్తమూ నశించినా నిశ్చలంగా ఉండే పరబ్రహ్మ స్థానం శ్రీకృష్ణుని ఆవాసం. అక్కడికి చేరినవారికి తిరిగి వెళ్ళడం ఉండదు. అనన్య భక్తి చేతనే ఆ దివ్యపదాన్ని చేరుకోగలరు.

రాజవిద్యారాజగుహ్య యోగము

కర్మ యోగము, జ్ఞాన యోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, జ్ఞాన విజ్ఞాన యోగములలో జీవన విధానానికి మార్గం, భగవత్ప్రాప్తికి సాధనం నిర్దేశించబడినాయి. అక్షర పరబ్రహ్మ యోగంలో పరబ్రహ్మాన్ని గురించిన పరిచయం జరిగింది. 9న అధ్యాయం అయిన "రాజవిద్యా రాజగుహ్య యోగము" కృష్ణుడు తానే భగంతుడనని, సృష్టి స్థితి లయ కారకుడనని తెలిపాడు. ఇది పవిత్రమైన జ్ఞానము. అన్నింటా విస్తరించిన పరమాత్ముని గురించి, ఆయనను పొందు విధము గురించి చెప్పబడినది. కృష్ణుడు ఈ యోగంలో చెప్పిన విషయ సారాంశం -
" విద్యలలో ఉత్తమమైనది, అతి నిగూఢమయినది ఈ బ్రహ్మ విద్య. జీవుని మోక్ష రహస్యాన్ని తెలియజేస్తుంది. అర్జునా! నా అధ్వర్యంలోనే సమస్త చరాచర సృష్టి జనిస్తుంది, కల్పాంతంలో నాలోనే విలీనమై మళ్ళీ కల్పాదిలో సృష్టింపబడుతుంది. ఈ జగత్తుకు నేనే తల్లిని, తండ్రిని, పూర్వుడను, కర్మ ఫల ప్రదాతను. ప్రణవ నాదాన్ని. వేదాలు, వేద విద్య, వేదాల ద్వారా తెలియదగినవాడను నేనే. సర్వాన్నీ భరించేవాడిని, ఆశ్రయాన్ని, బీజాన్ని, శరణునొసగేవాడిని, సాక్షిని, సృష్టి స్థితి లయ కారకుడను, సత్‌స్వరూపుడను, అమృతుడను. మూఢులు నా తత్వాన్ని తెలియజాలక వ్యర్ధమైన ఆశలతోను, నిష్ప్రయోజనమైన కర్మలతోను నశిస్తున్నారు. సజ్జనులు నన్ను సదా కీర్తిస్తూ జహఞానయోగం ద్వారా ఆరాధిస్తారు. అనన్య చింతనతో నన్ను ఉపాసించేవారి యోగ క్షేమాలు నేనే వహిస్తాను."

"అన్య దేవతలను ఆరాధించేవారు కూడా నన్నే ఆరాధిస్తున్నారు. నేనొసగే కామ్యార్ధాలను ఆయా దేవతల ద్వారా పొదుతున్నారు. నన్ను కొలిచేవారు నన్నే పొందుతారు. పవిత్రమైన హృదయంతో నాకు పత్రము, పుష్పము, ఫలము, జలము ఏది తర్పించినా దానిని స్వీకరించి నేను తృప్తుడనౌతాను. ఏ పని చేసినా ఆ కర్మ ఫలం నాకు సమర్పిస్తే నీవు కర్మ బంధంనుండి విముక్తుడవౌతావు. నన్ను ఆరాధించే ఎటువంటి భక్తుడైనా అతడెన్నటికీ నశింపడు. ఎవరైనా నన్ను ఆశ్రయిస్తే పరమగతిని పొందుతారు. కనుక నాయందే మనసు లగ్నం చేసి, నా భక్తుడవై, నన్నారాధించుము. నన్నే శరణు జొచ్చుము. నన్నే నీవు పొందెదదవు"

విభూతి యోగము

ఇంతకు ముందు యోగాలలో ముందుగా భగవంతుని పొందడానికి అవుసరమైన సాధన చెప్పబడింది. తరువాత అక్షరమైన పరబ్రహ్మమంటే ఏమిటో, ఎవరో, ఆ పరబ్రహ్మను పొందడానికి ఏమి చేయాలో కృష్ణుడు చెప్పాడు. ఇక ఈ అధ్యాయంలో ఆ పరబ్రహ్మము ఏయే రూపములలో గోచరిస్తుందో తెలిపాడు. సకల చరాచరమలలో, లోకములలో, యుగములలో వ్యాపించియున్న తన అనంతమైన విభూతులలో కొద్ది విభూతులను భగవానుడు అర్జునునకు తెలియజెప్పెను.

" నేను సమస్త మానవుల హృదయాలలో ఆసీనుడనై యున్నాను. సమస్తమునకు ఆది, మధ్య, అంతము నేనే అనగా దైవమునకు ఆది అంతము నామము రూపము లేవు.. ఆదిత్యులలో విష్ణువును. తేజోమయమైనవానిలో సూర్యుడను. గోవులలో కామధేనువును. దైత్యులలో ప్రహ్లాదుడను. ఆయుధ ధారులలో రాముడను. నదులలో గంగ. స్త్రీలలో కీర్తి, మేధ, క్షమ. పాండవులలో అర్జునుడను. మునులలో వ్యాసుడను. వృష్ణులలో వాసుదేవుడను. విజయులలో జిగీషను. మోసగాళ్ళలో ద్యూతాన్ని. జలచరాలలో మొసలిని. జలరాశులలో సముద్రాన్ని. వేయేల? ఐశ్వర్యమయము, కాంతిమయము, శక్తి మయము ఐనవన్నియు నా తేజస్సులో ఒక అంశనుండి కలిగినవి. సప్తర్షులు, సనకసనందనాదులు, మనువులు నా మానసమునుండే ఉద్భవించారు. జ్ఞానులు నా దివ్య విభూతులను తెలిసికొన్నవారై, నాయందే మగ్నులై, పరస్పరం నాగురించి ఒకరికొకరు బోధించుకొంటూ ఆనందిస్తుంటారు." - అని తన విభూతులను గురించి తానే ఇలా చెప్పాడు భగవంతుడైన వాసుదేవుడు. ,

విశ్వరూపసందర్శన యోగము

భగవానుని దివ్యగుణ వైభవాలను గురించి విన్న అర్జునుడు భగవానుని షడ్గుణైశ్వర్య సంపన్నమైన తేజోరూపమును చూపమని ప్రార్ధించెను. సామాన్య చక్షువులతో ఆ రూపం చూడడం దుర్లభం గనుక కృష్ణుడు అర్జుననకు దివ్యదృష్టిని ప్రసాదించెను. అపుడు అర్జునుడు అసంఖ్యాక ముఖములు, నేత్రములు, అద్భుతాయుధములు ధరించి అనంతముగా విస్తరించిన దేవదేవుని విశ్వరూపమును దర్శించెను. అది దివ్యమాల్యాంబర ధరము, దివ్య గంధానులేపనము. ఆ మహాకాల స్వరూపమును అంతకు ముందెవ్వరును చూడలేదు. అర్జునుడు పులకించి ఆ అనంతరూపుని ఇలా ప్రస్తుతించాడు.

"దేవదేవా! జగత్పతే! అనంతరూపా! సూర్యునివలె ప్రజ్వలించుచున్న నీ అనంత రూపము చూడ నాకు శక్యము గాకున్నది. నీవు దేవదేవుడవు, సనాతనుడవు. అనంత శక్తి సంపన్నుడవు. నీయందు బ్రహ్మాది సమస్త దేవతలు కనిపించుచున్నారు. దేవతు, మహర్షులు, పితరులు నిన్ను స్తుతిస్తున్నారు. ప్రభో! నీకు అనేక నమస్కారములు. మరల మరల నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము" అని ప్రార్ధించాడు.

అర్జునుని కరుణించి భగవానుడు తన రూపాన్ని ఉపసంహరించి ఆ అద్భుత రూపాన్ని దర్శించడం తపస్సు వలన కాని, వేదాధ్యయనం వలన గాని అలవి కాదని చెప్పాడు. అనన్యమైన భక్తి వలన మాత్రమే ఆ దివ్యరూపాన్ని తెలుసుకోవడం సాధ్యమని తెలిపాడు.

భక్తి యోగము

పరమాత్ముని సగుణ, నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలెనని అర్జునుడు ప్రశ్నించెను. రెండును భగవానుని చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చెను. ఆపై భగవంతుడు జ్ఞానియైన తన భక్తుల లక్షణములను వివరించెను. భగవంతుని యెడల అత్యంత ప్రేమ కలిగి ఉండడం భక్తి అనబడుతుంది. ఉత్తమ భక్తుడు ఇంద్రియ నిగ్రహము, సమ భావము, సర్వ భూత హితాభిలాష కలిగి ఉండాలి. ఏ ప్రాణినీ ద్వేషింపక అన్ని జీవులపట్ల మైత్రి, కరుణ కలిగి ఉండాలి. అహంకార మమకారాలను విడచిపెట్టాలి. ఓర్పు, సంతుష్టి, నిశ్చల చిత్తము కలిగి ఉండాలి. శుచి, శ్రద్ధ, కార్య దక్షత కలిగి ఉండాలి. మనోబుద్ధులను భగవంతునికి అర్పించాలి.

క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము

మానవుల శరీరము క్షేత్రము. ఆ క్షేత్రమును గూర్చి తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రములలోను అంతర్యామిగానున్న క్షేత్రజ్ఞుడు పరమాత్ముడే. అని, అట్టి పరమాత్ముని స్వరూపమును కృష్ణపరమాత్ముడు తెలియజెప్పెను.
క్షేత్రమంటే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారములతో కూడుకొని యున్న శరీరము. క్షేత్రజ్ఞుడంటే క్షేత్రంలో ఉండే జీవుడు. అన్ని క్షేత్రాలలో ఉండే క్షేత్రజ్ఞుడను నేనే అని, ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్యనున్న యదార్ధ సంబంధం తెలిసికోవడం జ్ఞానమని కృష్ణుడు ఉపదేశించాడు. అలాంటి జ్ఞానం కలిగిన జ్ఞాని లక్షణాలు - తనను తాను పొగడుకొనకపోవడం, గర్వం లేకపోవడం, అహింసాచరణ, ఋజుత్వము, గురు సేవా తత్పరత, శుచిత్వము, స్థిర బుద్ధి, ఆత్మ నిగ్రహం, ఇంద్రియ విషయాలపై వైరాగ్యం కలిగి ఉండటం, ఇష్టానిష్టాల పట్ల సమభాఞం కలిగి ఉండడం, ఏకాంత ప్రియత్వం, తత్వ జ్ఞానం యొక్క ధ్యేయాన్ని గ్రహించడం, భగవంతునియందు అనన్యమైన భక్తి కలిగి ఉండడం వంటివి.

ఇలాంటి జ్ఞానం లేని అజ్ఞాని తన ఆత్మ తత్వాన్ని తెలిసికొనలేక, క్షేత్రమే తాను అని భ్రమించిసంసార బంధాలకు లోనౌతాడు. అనేక జన్మలనెత్తుతాడు. యదార్ధంగా శరీరానికి భిన్నంగా, సాక్షీభూతంగా, ప్రభువుగా, భరించువానిగా భగవానుడున్నాడు.

గుణత్రయవిభాగ యోగము

ఆత్మ నాశన రహితమైనది. కాని ప్రకృతివల్ల ఉద్భవించిన సత్వ రజస్ తమో గుణములు జీవాత్మను శరీరమున బంధించును. అనుచు శ్రీకృష్ణుడు ఈ మూడు గుణముల స్వభావమును, ప్రభావమును వివరించెను. అందరిలోను ఉన్న సత్వరజస్తమో గుణాల ప్రభావం వలన జీవులు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ త్రిగుణాలు ప్రకృతితోపాటు ఉద్భవించి క్షేత్రజ్ఞుడిని క్షేత్రంలో బంధించి ఉంచుతాయి. బ్రహ్మాండమంతా భగవంతుని కారణంగానే సృజింపబడుతుంది.

సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశింపజేయునది, జీవునికి సుఖంపట్ల జ్ఞానం పట్ల ఆసక్తిని పెంచి జీవుని బంధిస్తుంది. రజోగుణం ఇంద్రియ విషయాలపై అనురక్తిని, తృష్ణను కలుగజేసి జీవుని నిరంతర కార్య కలాపాలలో బంధించి ఉంచుతుంది. తమోగుణం అజ్ఞానం వలన కలుగుతుంది. భ్రమ, అజాగ్రత్త, నిద్ర, సోమరితనం వంటి వాటిలో జీవుని బంధిస్తుంది. సత్వ గుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన మూఢత్వము కలుగుతాయి.

దేనినీ ద్వేషింపకుండా, కాంక్షించకుండా, సమత్వంతో నిర్మ మనస్కుడైనవాడు అమృతత్వాన్ని పొందుతాడు. భగవంతుని అచంచల భక్తి విశ్వాసాలతో ఆరాధించేవాడు గుణాతీతుడై బ్రహ్మ పదాన్ని పొందడానికి అర్హుడౌతాడు.

పురుషోత్తమప్రాప్తి యోగము

త్రిగుణాత్మకమైన సంసార వృక్షమును శ్రీకృష్ణుడు వర్ణించెను. జగత్తులో నాశనమొందువాడు క్షరుడు. వినాశరహితుడు అక్షరుడు. వీరిద్దరికంటె ఉత్తమమైనవాడు, అతీతుడు గనుక భగవంతుడు పురుషోత్తముడు.

దైవాసురసంపద్విభాగ యోగము

అసుర లక్షణములు, దైవ లక్షణములకు మధ్య అంతరమును భగవంతుడు వివరించెను.

శ్రద్దాత్రయవిభాగ యోగము

వివిధమార్గాలలో పూజలు చేసేవారి శ్రద్ధ ఏ విధమైనది? ఎవరు ఏవిధంగా యజ్ఞానుల, దానాలు చేస్తారు?

మోక్షసన్యాస యోగము

కనుక అన్ని సంశయములను పరిత్యజించి, తనయందే మనసు నిలిపి యుద్ధము (కర్మ) చేయమని భగవంతుడు ఉపదేశించెను. అర్జునుడు మోహవిరహితుడయ్యెను. యోగేశ్వరుడగు కృష్ణుడు, ధనుర్ధరుడైన పార్ధుడు ఉన్న చోట సంపద, విజయము తప్పక ఉంటాయని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు.

భగవద్గీత విశిష్టత

భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీతకు హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రశంసించే కొన్ని ఆర్యోక్తులు ఇవి:
సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందనః
పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్
  • శ్రీకృష్ణుడను గొల్లవాడు ఉపనిషత్తులనెడు గోవులనుండి అర్జునుడనెడి దూడను నిమిత్తముగా చేసికొని గీత అను అమృతమును పితికెను. బుద్ధిమంతులు అంతా ఈ గీతామృతమును పానము చేయవచ్చును.
  • ప్రతి వ్యక్తి గీతను శ్రవణ, కీర్తన, పఠన, పాఠన, మనన, ధారణాదుల ద్వారా సేవింపవలెను. అది పద్మనాభుని ముఖ కమలమునుండి ప్రభవించినది. (మహాభారతం - భీష్మ పర్వం)
  • నేను గీతను ఆశ్రయించి ఉందును. గీత నా నివాసము. గీతాధ్యయనము చేయువాడు భగవంతుని సేవించినట్లే (వరాహ పురాణం)
  • నిరాశ, సందేహములు నన్ను చుట్టుముట్టినపుడు, ఆశాకిరణములు గోచరించనపుడు నేను భగవద్గీతను తెరవగానే నన్ను ఓదార్చే శ్లోకము ఒకటి కనిపిస్తుంది. ఆ దుఃఖంలో కూడా నాలో చిరునవ్వులుదయిస్తాయి. భగవద్గీతను మననం చేసేవారు ప్రతిదినమూ దానినుండి క్రొత్త అర్ధాలు గ్రహించి ఆనందిస్తారు. (మహాత్మా గాంధీ)

భగవద్గీత ఆవిర్భావం

భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సన్నద్ధమయ్యారు. పాండవవీరుడైన అర్జునునకు రధసారధి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారూ శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రధాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని "నా కర్తవ్యమేమి?" అని అడిగాడు. అలా అర్జునునికి అతని రధ సారధి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.

భగవద్గీత

భగవద్గీత , మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు.

భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.

బ్రాహ్మణులు


  • సనాతన హిందూ సాంప్రదాయంలో చాతుర్వర్ణ వ్యవస్థ యందు ఉన్నతమైన వర్గం బ్రాహ్మణులు. బ్రాహ్మణులు లేదా బ్రాహ్మలు అనగా బ్రహ్మ ముఖము నుండి పుట్టిన వారు. బ్రాహ్మలు అని వాడుకలో పిలిచినప్పటికీ "బ్రాహ్మణులు" అనడం సముచితం. యజనం యాజనం దానం బ్రాహ్మణస్యప్రతిగ్రహః అధ్యాపనం చాధ్యయనం షట్కకర్మాణి ద్విజోత్తమాః. మునుల వలన ఏ జాతి స్ర్తీకి జన్మించిన వారైనను బ్రాహ్మణులుగా గుర్తించబడతారు. భారతీయ మసుస్మృతి ప్రకారం క్షత్రియులు (యోధులు, చట్టం అమలు, పరిపాలకులు), బ్రాహ్మణులు (పండితులు, ఉపాధ్యాయులు, అగ్ని పూజారులు), వైశ్యులు (వ్యవసాయదారులు, పశువులు రైజర్స్, వ్యాపారులు, బ్యాంకర్లు) మరియు శూద్రులు (సేవకులు) అను నాలుగు "వర్ణాలు" లేదా తరగతులు ఉన్నాయి.
  • హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణుల ప్రధాన కర్తవ్యం సమాజోన్నతికి పాటుపడటం. నిరంతరం జ్ఞానార్జన చేస్తూ, వేదములయందు ప్రావీణ్యం కలవారై, సత్యనిరతిని, ధర్మ వర్తనను సమాజానికి బోధిస్తూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలి. దైవ విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించి సమాజాన్ని ఉత్తమ మార్గంలో నడపడం వలన వారికి సమాజంలో సముచిత గౌరవం లభించుతున్నది. వారు వేదాలు, ఉపనిషత్తులు మరియు భగవద్గీత వంటి వేద మరియు పౌరాణిక ఆధ్యాత్మిక సంబంధ విషయాలపై మంచి అవగాహనను కలిగి ఉంటారు.
  • బ్రాహ్మణులను ""విప్ర"" ("ప్రేరణ"), లేదా ""ద్విజ"" ("రెండుసార్లు జన్మించిన") అని కూడా పిలుస్తారు. ఆధునిక వాడుక భాషలో అందరూ "" బ్రాహ్మణులు"" అయినప్పటికీ, ప్రాంతీయ మత ఆచార సాంప్రదాయ వ్యవహారములు మరియు వేద పాఠశాలలు (శాఖలు) వలన వారు ఇంకా వివిధ ఉప కులాల వారీగా విభజించబడ్డారు. బ్రాహ్మణులు సంప్రదాయబద్ధంగా ఆలయం పూజారులు అయిననూ బ్రాహ్మణులు అందరూ అగ్ని (హోత్ర) పూజారులు కారు. నేడు చాలా కొద్ది మంది బ్రాహ్మణులు మాత్రం వేద విద్య నేర్చుకోవడం, సన్యాస మరియు నిరాడంబరంగా దేశంలో పురోహితుల విధులు నిర్వర్తించుతున్నారు. మరియు పురాతన భారత సామాజిక నిర్మాణం పతనం కారణంగా, వివిధ వృత్తులు మరియు ఉద్యోగాలకు (బ్రిటిష్ వారి ద్వారా తేబడినవి) బ్రాహ్మణులు అవకాశములు వెతుక్కున్నారు. వారి బోధనా మరియు జ్ఞానమునకు గుర్తింపుగా ఉపకారవేతనాలు మరియు బహుమతులు ద్వారా వారికి మద్దతు లభించినది. అప్పటి నుండి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు బ్రాహ్మణుల వలసలు ఉన్నాయి.

చరిత్ర:
పురాణాల ప్రకారం, బ్రాహ్మణ వర్గం బ్రాహ్మణి యొక్క భర్త అయిన బ్రహ్మ సృష్టి. ఆధునిక బ్రాహ్మణులు పలు (మత) సాంప్రదాయాలకు వేదాల నుండి ప్రేరణ పొందామని పేర్కొంటున్నారు. వేదాలు బ్రాహ్మణులకు జ్ఞానం యొక్క ప్రధాన వనరుగా చెబుతారు. హిందూ మత సాంప్రదాయం ప్రకారం, వేదాలు అపౌరుషేయాలు మరియు అనాది (ప్రారంభం-లేనివి).

  • వేదాలు ""స్మృతి/స్మృతులు"" ("ఇది విన్న అని")గా భావిస్తారు మరియు ఆధునిక బ్రాహ్మణ సంప్రదాయం వీటి ప్రబలమైన అధారములతోనే ఆధునిక బ్రాహ్మణ సంప్రదాయం పరిగణించబడుతుంది. ""స్మృతి/స్మృతులు""లో నాలుగు వేదాలు (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మరియు అథర్వణవేదము ) మాత్రమే కాకుండా కానీ వాటికి సంబంధిత బ్రాహ్మణాలు, అరణ్యకాలు లు మరియు ఉపనిషత్తులు కలిగి ఉన్నాయి.
  • బ్రాహ్మణులు, అనేవారు 19 వ శతాబ్దపు యూరోపియన్ హిందూమతం విద్యార్ధుల ద్వారా ఇరాన్, తూర్పు యురేషియా లేదా మధ్య ఆసియా ఆర్యన్ వలసదారులు లోని భాగంగా ఉండే వారని విభావిస్తారు, షుమారు 2600 BCE సంవత్సరాలలో, వారి ప్రాధమిక మతం, ఆరాధన ఆధారం మయినటువంటి పశుపతి (తరువాత లార్డ్ శివ అని పిలుస్తారు)ని అరాధిస్తున్న వారు/వారిని, దక్షిణ దిశగా స్థానిక జనాభా పంపేసింది. ఆర్యన్ బ్రాహ్మణులు, వివిధ సమూహాల మధ్య కార్మిక మరియు వారి ప్రత్యేకతల ననుసరించి ""కులాలు"" అని ఒక విభాగం ద్వారా, వారికి అత్యధిక గౌరవం కేటాయించి అనుసరించారు. ఈ యూరోపియన్ పండితులు ప్రకారం, వారు హిందువుల మూఢ మత సంప్రదాయాలకు కుల వ్యవస్థ యొక్క "'మూలంగా"', వయస్సు మరియు రోజు అని లేకుండా, ఆధునిక రోజుల్లో ఇప్పటి వరకు జీవించి ఉన్నదని, వర్ణించారు.
  • 1931 సం. జనాభా లెక్కలలో (గత భారత జనాభా లెక్కల కుల రికార్డు), బ్రాహ్మణులు సంఖ్య మొత్తం 9% భారతదేశంలో ఉన్నదని లెక్కించారు. బ్రాహ్మణులు ఉత్తరప్రదేశ్ లో అనేక మంది ఉన్నారు. అక్కడ వారి రికార్డు జనాభాలో కేవలం 15% గా ఉంది. ఆంధ్ర ప్రదేశ్లో, వారు జనాభాలో 2% కంటే తక్కువగాను, తమిళనాడులో వారు 3% కన్నా తక్కువ మంది ఉన్నారు. కేరళలో, నంబూద్రి బ్రాహ్మణులు జనాభాలో 0.7% ఉన్నారు. పశ్చిమ బెంగాల్ లో కూడా దాదాపుగా ఇదే శాతం మంది ఉన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం, బ్రాహ్మణులు భారత జనాభాలో 9% కంటే తక్కువగా ఉన్నారు.
బ్రాహ్మణ శాఖలు:

  • బ్రాహ్మణ కులాలు విస్తారంగా రెండు ప్రాంతీయ సమూహాలుగా విభజించవచ్చు:
कर्णाटकाश्च तैलंगा द्राविडा महाराष्ट्रकाः,गुर्जराश्चेति पञ्चैव द्राविडा विन्ध्यदक्षिणे ||सारस्वताः कान्यकुब्जा गौडा उत्कलमैथिलाः,पन्चगौडा इति ख्याता विन्ध्स्योत्तरवासिनः ||
  • ఈ పై శ్లోకం ద్వారా, ఉత్తర భారతదేశం మరియు ఉత్తర వింధ్య పర్వతాలుకు చెందిన వారిని పాంచ గౌడ బ్రాహ్మణులు గా మరియు దక్షిణ వింధ్య పర్వతాలు చెందిన వారిని పాంచ ద్రావిడ బ్రాహ్మణులు గా భావించారు. అయితే, ఈ శ్లోకం మాత్రం కల్హణ లోని రాజతరంగిణికి సంబందిచినది.
  • అనువాదం: కర్ణాటక (కన్నడ), తెలుగు (ఆంధ్ర), ద్రావిడ (తమిళ్ మరియు కేరళ), మహారాష్ట్ర మరియు గుజరాత్ అను ఐదు దక్షిణాది (పాంచ ద్రావిడ)లు ఉన్నారు. అలాగే సారస్వత, కన్యాకుబ్జము, గవుడ, ఉత్కళ్(ఒరిస్సా), మైథిలి అను ఐదు ఉత్తరాది (పాంచ గౌడ)లు ఉన్నారు. ఈ వర్గీకరణ రాజతరంగిణి యొక్క కల్హణ లో లేదా దానికి ముందువి ఉన్న కొన్ని శాసనాలు లో జరుగుతుంది
పంచ-ద్రావిడ (ఫైవ్ దక్షిణ):
( కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్ర, ద్రావిడ (తమిళనాడు, కేరళ) మరియు గుజరాత్) రాష్ట్రాలకు చెందిన వీరిని దక్షిణాపథులు అని కూడా వ్యవహరించెదరు.

ఆంధ్ర ప్రదేశ్
  • ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణులు (తెలుగు బ్రాహ్మణులు) విస్తారంగా 2 సమూహాలుగా వర్గీకృతమయి ఉన్నాయి:
  • వైదికి బ్రాహ్మణులు (వేదాలు అభ్యసించడము మరియు మత (కళలు) వృత్తుల ప్రదర్శన అని అర్థం) మరియు నియోగీ ( లౌకిక, ఉద్యోగం చేస్తూన్న వారు మాత్రమే ). వీరందరూ మరింత ఉప కులాలగా అనేకంగా విభజించబడ్డారు. అయితే, బ్రాహ్మణులలో ఎక్కువమంది, వైదీకులు మరియు నియోగులు, అనే రెండు శాఖలు మాత్రమే లౌకిక వృత్తులలో పాల్గంటూ ఆచరించుతూ ఉన్నారు.
  • విశ్వ బ్రాహ్మణులు (విశ్వకర్మలు)
  • వైదీకీ బ్రాహ్మణులు తదుపరి మరింతగా వెలనాట్లు, వేంగినాడ్లు, ములకనాట్లు మరియు కోసలనాట్లు తదితర బ్రాహ్మణులు, ఉపశాఖలుగా విభజించబడ్డారు.
  • "ద్రావిడ" అనే మరొక ఉప శాఖ ఆంధ్రప్రదేశ్‌ నకు వలస వచ్చిన తమిళ బ్రాహ్మణులు ద్వారా ఏర్పడినది.
గుజరాత్
  • గుజరాత్ బ్రహ్మణులు, వీరిలో రెండు ఉపశాఖలు సెంట్రల్ ప్రావిన్సెస్ గుర్తించవచ్చు. మొదటి శాఖ పేరు ఖేద్‌వాలా బ్రాహ్మణులు, ఖేద అనేది గుజరాత్ లో ఒక గ్రామం పేరు కలిగి ఉన్నది. ఈ శాఖలోని వీరు, ఒక ఖచ్చితమైన, ఆచారబద్ధమైన తరగతి వారే కాక ఒక మంచి ఉన్నత స్థానమును పొంది ఉన్నారు. రెండ శాఖ వారు నాగర్ బ్రాహ్మణులు. వీరు నిమార్ మరియు చుట్టు ప్రక్కల ప్రాంతాలలో గ్రామ పూజారులుగాను, జ్యోతిష్కులుగానూ అనాది (ఎంతోకాలం)గా స్థిర పడ్డవారు. వీరి సాంఘిక స్థితి మాత్రం ఏవిధముగా నయిననూ కొంత లేదా కొద్దిగా తక్కువ స్థాయిలో ఉంటుంది.
మహారాష్ట్ర
  • దేశస్థ బ్రాహ్మణులు
  • చిత్‌పవన బ్రాహ్మణులు (కొంకణస్థ)
  • కర్‌హద బ్రాహ్మణులు
  • దేవరుఖీ బ్రాహ్మణులు
  • దైవజ్ఞ బ్రాహ్మణులు
  • సరస్వత బ్రాహ్మణులు
కర్ణాటక
  • కర్ణాటక బ్రాహ్మణులు: బ్రాహ్మణులు కర్నాటక దేశము , బ్రాహ్మణులు కర్నాటక రాజ్యము లేదా బ్రాహ్మణులు గోచి మరియు కౌపీనము ధారులు.
  • గోచి , కౌపీనము ధారులను మైసూర్ రాష్ట్రం ప్రాంతం ఇముడ్చుకొంది. అంతేకాక కెనరా, ధార్‌వార్ మరియు బెల్గాం వంటి బ్రిటిష్ జిల్లాలు చేర్చుకొన్నాయి.
తమిళనాడు
  • అయ్యంగార్లు శాఖ తదుపరి (వడకళ్ళై మరియు టెన్‌కాల్లై లోకి ఉప శాఖలుగా విభజించబడింది)
  • శతత శ్రీవైష్ణవులు శాఖ (శతాని, చత్తాని, చత్తాత శ్రీవైష్ణవులు) లోకి ఉప శాఖలుగా విభజించబడింది
  • పండితులు లేదా అయ్యర్లు లేదా అయ్యర్ శాఖ (వడమ, వత్తిమ, బ్రహచరణం, అష్టసహస్రం, గురుకల్ దీక్షితార్ , కనియలార్, ప్రథమశాఖి, ద్రావిడ బ్రాహ్మణులు) లోకి మరింత ఉప శాఖలుగా విభజించబడింది,
  • విశ్వ (విశ్వకర్మ) బ్రాహ్మణులు
కేరళ
  • నంబూత్రి బ్రాహ్మణులు
  • కేరళ పండితులు
  • ఎంబ్రాన్‌త్రి
  • పుష్పక బ్రాహ్మణులు (అంబలవాసులు}
  • శారద బ్రాహ్మణులు
  • విశ్వబ్రాహ్మణులు (విశ్వకర్మ)
  • నాగరిక బ్రాహ్మణులు లేదా ఉత్తర భారతదేశం నుండి బ్రాహ్మణ వలసదారులు
గోత్రములు మరియు ప్రవరలు

  • సాధారణంగా వీరిలోని ఏ వ్యక్తి గోత్రము అయిననూ వారి పూర్వీకులు మగవారి వంశానుక్రమం, వంశము, మగ సంతతి, తరము, జన్మము, ఇత్యాదులను ఎఱుక చేస్తూన్న వంశ పరంపరలో ఒక సముదాయ ఉమ్మడి పూర్వీకుని ఆధారముగా తెలియఁజేస్తూ సూచించుతుంది. వీరిలోని ఏ వ్యక్తి అయిననూ ""నాది "'భారద్వాజస"' గోత్రం"" అని చెప్పిన, వంశానుక్రమం, వంశము, ఉత్పత్తి, జన్మము, ఇత్యాదులయిన "'వంశవృక్షం"' పరిశీలిస్తే అతను భరద్వాజుడు అనే ఋషి వారసుడు, వంశ పరంపర సంతతి అని అర్ధం. ఈ గోత్రాలు నేరుగా ప్రజాపతి లేదా తరువాతి బ్రహ్మకు సంబందము లేదు.
  • బ్రాహ్మణులు వారి యొక్క గుర్తించదగిన పూర్వీకులు సంతతికి చెందిన వారిని ఆధారంగా తమను , తండ్రి వారసత్వం నుండి వర్గీకరించు కొందురు. ఈ పూర్వీకులు వారికి ఎంచుకున్న బ్రాహ్మణులుగా మారిన పురాతన భారతీయ ఋషులు లేదాక్షత్రియులు (యోధులు) సంతతికి ఆధారములు అయి ఉందురు. బ్రాహ్మణులలోని అతి ముఖ్యమైన పది (10) గోత్రముల వంశానుక్రమం, వంశము, ఉత్పత్తి (వ్యుత్పత్తి), సంతతి, తరము, జన్మము, ఇత్యాదులను పరిశీలించగా, ఈ గోత్రముల వారు పైన ఉదహరించిన ఋషులు తదితరులు పూర్వీకులు అయిన కణ్వుడు, జమదగ్ని, భరద్వాజుడు, కౌండిన్య, గౌతముడు, అత్రి, వశిష్టుడు, కశ్యపుడు, అగస్త్యుడు గోత్రములు, క్షత్రియుల వంశక్రమముగా వ్యుత్పత్తి, జాడలు పట్టుకొని, గోత్ర జాడతీయుట, ఆనవాలు. గురుతులు పట్టుట చేసిన రెండు గోత్రములకు క్షత్రియులు అయిన విశ్వామిత్రుడు మరియు మిత్రాల నుండి ఆధారములు తరువాతి సంతతికి ఉన్నాయి. అధర్వ సూత్ర కర్తలు బ్రాహ్మణుల శాఖలతో పాటు వారి ప్రవరలను కూడా ఏర్పరిచారు. హోత్ర సూత్ర కర్తలు అయిన భారద్వాజ, అగ్నివేశ్య, సత్యాషాడ, వైఖానస, హిరణ్యకేశ, ఆపస్తంబ, కాత్యాయన, బోధాయన, లోగాక్షి, ఇత్యాది గోత్ర ప్రవరలకు శాస్త్రకర్తలు. భారద్వాజ, గౌతమ, కశ్యప, వశిష్ట, కాలీయ, అత్రి, వైవస్వత సప్త ఋషులకు బృగువు, అగస్త్య, అంగీరసులు ఎల్లరూ గోత్ర గణాలకు ఆద్యులుగానూ, మూల పురుషులుగానూగోత్ర ప్రవరల యందు దర్శనమిస్తున్నారు.
  • గోత్రములు కొన్ని సమూహాలుగా అమర్చబడి ఉంటాయి. అశ్వలాయన సూత్రము ప్రకారము వశిష్ట గణ గోత్ర ప్రవరలు నందు ఉపమన్యు, పరాశర, జాతుకర్ణ్య మరియు వశిష్ట అని నాలుగు ఉపవిభాగాలుగా ఉన్నాయి. ఈ నాలుగు ప్రతి ఒక్కటిలో మళ్ళీ అనేక ఉప విభాగాల విభజించ బడ్డాయి.
శాఖలు మరియు ఋషులు
బ్రాహ్మణులలో చాలా శాఖలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినవి.
  1. ద్రావిడులు - పూర్వం ద్రవిడ దేశం (తమిళనాడు) నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు.
  2. వైదికులు - వీరు అసలైన స్థానికులు. వైదికులు అనగా వైదిక విద్యనభ్యసించి, వైదిక వృత్తినే తమ కులవృత్తిగా చేసుకొని జీవించేవారు. సాధారణంగా పురోహితులు, గుళ్ళల్లో పూజారులు మొదలగు వారు. మరలా పురోహితులలో రెండు రకాలవారు ఉంటారు. శుభ కార్యాలు చేయించే వారు (పెళ్ళిళ్ళు, వ్రతాలు, పూజలు మొదలగునవి చేయించే వారు), తరవాత అపరం చేయించే వారు (శ్రాద్ధ కర్మలు, తద్దినాలు చేయించేవారు).
  3. నియోగులు - నియోగులలో మరలా రెండు రకాలు - ఆరు వేల నియోగులు(కరణాలు), ప్రధమ శాఖ వారు. ఇక ఆరువేల నియోగుల విషయానికి వస్తే, శ్రీ కృష్ణ దేవరాయల(?) కాలంలో వారి రాజ్య పరిపాలన సులభం అవడం కొరకు ఒక రాత్రి కి రాత్రే ఆరు వేల మందిని గ్రామాధికారులుగా నియమింఛడం జరిగింది. అప్పుడు అలా గ్రామాధికారులుగా నియోగించబడిన వారు ఆరు వేల నియోగులుగాను, ఇంకా మిగిలిపోయిన ఆ శాఖలోని వారందరూ ప్రధమ శాఖ గానూ పిలువబడుతున్నారని వినికిడి.
  4. వీరేగాక బ్రాహ్మణులలో ఇంకా ఆంధ్రులుతెలగాణ్యులువెలనాట్లువేగినాట్లు,కాసనాట్లు మొదలగు ఉప శాఖలు చాలా ఉన్నాయి.వైష్ణవులుశైవులులింగధారులు కూడా బ్రాహ్మణులలో శాఖలే.


సంప్రదాయములు

మూడు సంప్రదాయములు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. అవి (1) స్మార్త సంప్రదాయము, (2) శ్రీవైష్ణవ సంప్రదాయము మరియు మధ్వ సంప్రదాయము అని మూడు రకములు బ్రహ్మణ సంప్రదాయములు కలవు.
స్మార్తులు
  • స్మార్త సాంప్రదాయము, స్మార్త ఆచారం, అనేది సంస్కృతం నుండి ఉద్భవించినది. ఒక ఆధునిక లేదా శాఖలు లేని హిందూ మతము లోని మతసాంప్రదాయంగా, విలువ కలిగిన వారు. వీరు దాదాపుగా అందరు హిందూ దేవతలను పూజిస్తారు అంగీకరిస్తారు. వేదాలు మరియు శాస్త్రాలు అనుసరించే అనుచరులుగా స్మార్త అనే పదము సూచిస్తుంది
వైష్ణవులు
  • దక్షిణ భారతదేశంలో శ్రీమద్ రామానుజాచార్యులు వారు ఇచ్చిన భక్తి మార్గం, సన్యాసించిన (పీఠాధిపతులు) వారి ప్రభోదనల ద్వారా శ్రీవైష్ణవ సంప్రదాయము వృద్ధి జరిగినది.
శైవులు
  • శైవత్వం (కొన్నిసార్లు ""శివత్వం"" అని కూడా పిలుస్తారు) అనేది ఒక నమ్మకం ఉన్న వ్యవస్థ. ఎక్కడ సర్వశ్రేష్టమైన, ముఖ్యమైన, పరమమైన భగవంతుడు అయిన శివ కొలువ బడతాడో అక్కడ వీరు ఉంటారు. వీరికి, హృదయ, మధ్య భాగము అయిన వేద సంప్రదాయం యొక్క ఒక ఉత్పన్న విశ్వాసం ఉంది. ఇటువంటి శైవ శాఖలు, పలు ఉప శాఖలు అయిన రుద్ర శైవులు, వీర శైవులు, పరమ శైవులు మరియు ఇతర ఉప శాఖలుగా విస్తరించినది.
  • హిందూ పురాణాలలోని రామాయణం కావ్యం ఆధారముగా, లంకను పాలించిన రావణాసురుడు దైవజ్ఞ బ్రాహ్మణుడు మరియు పండితుఁడు, వివేకి, ముని, బుధజనుఁడు, జ్ఞాని,ఋషి అయిన విశ్రవసువు యొక్క కుమారుడు మరియు పండితుడు, మహా తెలివైనవాడు, ముని, బుద్ధిమంతుడైన. విజ్ఞాని. జ్ఞానంగల పులస్త్య మహర్షి యొక్క మనవడు.

గాయత్రీ మంత్రము





ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యమ్‌
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌
న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. గాయత్రి అనే పదము 'గయ' మరియు 'త్రాయతి' అను పదములతో కూడుకుని ఉన్నది. "గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించారు. 'గయలు' అనగా ప్రాణములు అని అర్థము. 'త్రాయతే' అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం.
వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమునుచేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీ
మద్రామాయణమును రచించినారు.

దేవతలు - గాయత్రీ మంత్రాలు

  • అగ్ని గాయత్రి - ఓమ్ మహా జ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి, తన్నో అగ్నిః ప్రచోదయాత్.
  • ఇంద్ర గాయత్రి - ఓమ్ సహస్ర నేత్రాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి, తన్నోఇంద్రః ప్రచోదయాత్.
  • కామ గాయత్రి - ఓమ్ కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి, తన్నోऽనంగః ప్రచోదయాత్.
  • కృష్ణ గాయత్రి - ఓమ్ దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోకృష్ణః ప్రచోదయాత్.
  • గణేశ గాయత్రి - ఓమ్ ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తన్నోదంతిః ప్రచోదయాత్.
  • గురు గాయత్రి - ఓమ్ సురాచార్యాయ విద్మహే వాచస్పత్యాయ ధీమహి, తన్నోగురుః ప్రచోదయాత్.
  • చంద్ర గాయత్రి - ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృతతత్త్వాయ ధీమహి, తన్నోశ్చంద్రః ప్రచోదయాత్.
  • తులసీ గాయత్రి - ఓం శ్రీతులస్యై విద్మహే విష్ణుప్రియాయై ధీమహి, తన్నో బృందాః ప్రచోదయాత్.
  • దుర్గా గాయత్రి - ఓం గిరిజాయై విద్మహే శివప్రియాయై ధీమహి, తన్నోదుర్గా ప్రచోదయాత్.
  • నారాయణ గాయత్రి - ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోనారాయణః ప్రచోదయాత్.
  • నృసింహ గాయత్రి - ఓం ఉగ్రనృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి, తన్నోనృసింహః ప్రచోదయాత్.
  • పృథ్వీ గాయత్రి - ఓం పృథ్వీదేవ్యై విద్మహే సహస్రమూర్త్యై ధీమహి, తన్నోపృథ్వీ ప్రచోదయాత్.
  • బ్రహ్మ గాయత్రి - ఓం చతుర్ముఖాయ విద్మహే హంసారూఢాయ ధీమహి, తన్నోబ్రహ్మః ప్రచోదయాత్.
  • యమ గాయత్రి - ఓం సూర్యపుత్రాయ విద్మహే మాహాకాలాయ ధీమహి, తన్నోయమః ప్రచోదయాత్.
  • రాధా గాయత్రి - ఓం వృషభానుజాయై విద్మహే కృష్ణ ప్రియాయై ధీమహి, తన్నోరాధా ప్రచోదయాత్.
  • రామ గాయత్రి - ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి, తన్నోరామః ప్రచోదయాత్.
  • లక్ష్మీ గాయత్రి - ఓం మహాలక్ష్మ్యేచ విద్మహే విష్ణుప్రియాయై ధీమహి, తన్నోలక్ష్మీః ప్రచోదయాత్.
  • వరుణ గాయత్రి - ఓం జలబింబాయ విద్మహే నీల పురుషాయ ధీమహి, తన్నోవరుణః ప్రచోదయాత్.
  • విష్ణు గాయత్రి - ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోవిష్ణుః ప్రచోదయాత్.
‍* శని గాయత్రి - ఓమ్ కాక ధ్వజాయ విద్మహే ఖడ్గ హస్తాయ ధీమహి, తన్నో మందః ప్రచోదయాత్.
  • శివ గాయత్రి - ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి, తన్నోరుద్రః ప్రచోదయాత్
  • సరస్వతీ గాయత్రి - ఓం సరస్వత్యై విద్మహే బ్రహ్మపుత్ర్యై ధీమహి, తన్నోదేవీ ప్రచోదయాత్.
  • సీతా గాయత్రి - ఓం జనక నందిన్యై విద్మహే భూమిజాయై ధీమహి, తన్నోసీతాః ప్రచోదయాత్.
  • సూర్య గాయత్రి - ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి, తన్నోసూర్యః ప్రచోదయాత్.
  • హనుమద్గాయత్రి - ఓం అంజనీ సుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి, తన్నోమారుతిః ప్రచోదయాత్.
  • హయగ్రీవ గాయత్రి - ఓం వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి, తన్నోహయగ్రీవః ప్రచోదయాత్.
  • హంస గాయత్రి - ఓం పరమహంసాయ విద్మహే మాహాహాంసాయ ధీమహి, తన్నోహంసః ప్రచోదయాత్.

ప్రతి పదార్ధం

గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలచే సూచింపబడింది. మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం క్రింద చూడండి.
  • ఓం = పరమేశ్వరుడు సర్వరక్షకుడు.
  • భూః = సత్ స్వరూపుడు (ఉనికి కలవాడు).
  • భువః = చిత్ స్వరూపుడు(జ్ఞాన రూపుడు).
  • స్వః = ఆనంద స్వరూపుడు(దుఃఖరహితుడు).
  • తత్ = అట్టి సచ్చినానంద లక్షణయుక్తమైన పరమేస్వరుడు.
  • సవితుః = ఈ సృష్టి కర్త.
  • వరేణ్యం = సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు.
  • భర్గః = శుద్ధ స్వరూపుడు (పాప రహితుడు).
  • దేవస్యః = అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్యస్వరూపము.
  • ధీమహి = హ్రుదయాంతరాల్లో (ఆత్మలో ఏకమై)
  • యః = ఆ పరమేశ్వరుడు.
  • నః ద్యః = మా బుద్ధులను.
  • ప్రచోదయాత్ = సత్కర్మలయందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములు పొంద సమర్ధం చేయుగాక.