పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. అటు హరికి, ఇటు హరుడికి, మరోపక్క వారిద్దరితనయుడైన అయ్యప్పకి కూడా ప్రీతికరమైన మాసమిది. హరిహరులిద్దరూ పరస్పరం
అభిమానించుకుంటారు, ఆరాధించుకుంటారు, పూజించుకుంటారు. హరిపూజ హరునికి
ఇష్టమైతే, శివపూజ కేశవునికి ప్రీతికరం. తులసీ పూజలు, వన భోజనాలు, సమారధాలు, ఉపవాసమలు, అభిషేకాలు, సహస్రనామ పారాయనలతో మార్మోగుతూ ఎంతటి నాస్తికుడైనా ఆస్తికభావానాలు కలుగజేసే మాసమిది. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ఈ మాసంలో ముప్పై రోజులు పర్వదినాలే..!
విదియ: ఈరోజు సోదరి ఇంటికి వెళ్ళు ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి.
తదియ: ఈనాడు పార్వతీదేవికి కుంకుమ పూజ చేయించుకుంటే స్త్రీలకు సౌభాగ్య సిద్ది కలుగుతుంది.
చవితి: కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి సందర్భంగా సుబ్రమంఎస్వర స్వామికి పుట్టలో పాలు పోయాలి.
పంచమి: దీనినే జ్ఞాన పంచమి అని కూడా అంటారు. ఈరోజు శుభ్రమంఎస్వర స్వామీ ప్రీత్యర్ధం అర్చనలు, అభిషేకాలు, చేయించుకున్నవారికి జ్ఞానవ్రుద్ది కలుగుతుంది.
షష్టి: నేడు బ్రహ్మచారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాదులతో సహా ఎర్రగళ్ళ కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది.
సప్తమి: ఈరోజు ఎర్రవస్త్రంలో గోదుమలు పోసి దానమివ్వడం వల్ల ఆయుష్షు వృద్ది అవుతుందని శాస్త్రోక్తి.
అష్టమి: ఈ గోపాష్టమి నాడు చేసే "గోపూజ" విశేష ఫలితాలనిస్తుంది.
నవమి: నేటినుండి మూడురోజులపాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. ఈరోజ రాత్రి విష్ణుపూజ చేయాలి.
దశమి: నేడు విష్ణు సహస్రనామ పారాయణ చేసి, గుమ్మడికాయను, ఉసిరికాయను దానం చేయాలి.
ఏకాదశి: ఈ ఏకాదశికే భోధనైకాదశి అని పేరు. ఈరోజు విష్ణుపూజ చేసిన వారికి ఉత్తమగతులు కలుగుతాయి.
ద్వాదశి: ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి. నేటి సాయంకాలం తులసికోటలో ఉసిరి కొమ్మను ఉంచి తులసికీ, ఉసిరికీ కళ్యాణం చేయించటం సకల పాపాలని క్షీణింప జేస్తుందని ప్రతీతి.
త్రయోదశి: ఈరోజు సాలగ్రామ దానం చేయటం వల్ల సకల కష్టాలు దూరమౌతాయని శాస్త్రోక్తి.
చతుర్దశి: నేడు శనైశ్చర ప్రాత్యర్డం ఇనుము, నువ్వులు, పత్తి, మినుములు, మొదలైన వాటిని దానం చేయటం వల్ల శని సంతృప్తి చెంది శుభ దృష్టిని ప్రసాదిస్తాడు.
పౌర్ణమి: కార్తీక పూర్ణిమ, మహాపవిత్రమైన ఈరోజు నదీస్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ darshanam చేసుకోవడం వల్ల పాపాలనీ పటాపంచలౌతాయి.
పాడ్యమి: (కార్తీక బహుళ పాడ్యమి) ఈరోజు ఆకుకూర దానం చేయడం శుభదాయకం.
విదియ: వనభోజనం చేయటం విశేష ఫలాలనిస్తుంది.
తదియ: పండితులకు, గురువులకు తులసీమాలను సమర్పించటం వల్ల తెలివితేటలు వృద్ది అవుతాయి.
చవితి: పగలంతా ఉపవాసముండి, సాయంత్రం వేల గణపతిని గారిక తో పూజ చేసి, ఆ గరికను తలగడ కింద పెట్టుకుని పడుకుటే దుస్వప్న దోషాలు పోయి సంపదలు కలుగుతాయి.
పంచమి: ఈరోజు చీమలకు నూకలు చల్లటం, శునకాలకు అన్నం తినిపించటం శుభ ఫలితాలనిస్తుంది.
షష్టి: గ్రామదేవతలకు పూజచేయటం వల్ల వారు సంతుష్టులై, ఏ విధమైన కీడు కలుగకుండా కాపాడుతారు.
సప్తమి: జిల్లేడు పూలతో గుచ్చిన దండనీ ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ది చెందుతాయి.
అష్టమి: కాలభైరవాష్టకం చదివి గారెలతో దండ చేసి, కాలభైరవానికి (కుక్కకు) సమర్పించటం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.
నవమి: వెండి లేదా రాగి కలశం లో నీరు పోసి పండితునికి/బ్రాహ్మణునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు.
దశమి: నేడు అన్నసంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై, కోరికలు తీరుతాయని పురాణోక్తి.
ఏకాదశి: ఈనాటి విష్ణ్యాలయం లో దీపారాదన, పురాణ శ్రవణం, పటనం, జాగరణ మున్నగునవి విశేష ఫలదాయకం.
ద్వాదశి: అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించటం శుభప్రదం.
త్రయోదశి: నవగ్రహారాదన చేయటం వల్ల గ్రహదోషాలు తోలుగుతాయి.
చతుర్దశి: ఈమాస శివరాత్రినాడు ఈస్వరర్చన, అభిషేకం చేయటం వల్ల అపంరుత్యుదోశాలు, గ్రహబాడలు తొలగి, పరిపూర్ణ ఆరోగ్యవంతులౌతారని పురాణోక్తి.
అమావాస్య: ఈరోజు పిత్రు దేవతల సంతృప్తి కొరకు ఎవరినైనా పిలచి వారికి భోజనం పెట్టాలి.లేదా పండితులకు, బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి. పగలు ఉపవాసం ఉండటం మంచిది. శివకేశవ ప్రీత్యర్డం దీపారాదన చేసి, కొబ్బరికాయ కోటి నమస్కరించాలి.
ఉత్తమమైనది ఉత్థాన ఏకాదశి
ఈ కార్తీకమాసం లో అత్యంత విశేషమైనది ఉత్థానఏకాదశి. అంటే శ్రీమహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాడ శుద్ధఎకాదశి నాడు యోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశినాడు మేల్కొన్న రోజుకే 'ఉత్థాన ఏకాదశి' అని పేరు.
విశిష్ట ఫలప్రదం తులసీ కల్యాణం
క్షీరాబ్ది ద్వాదశి నాడు ముప్పైరెండు మంది దేవతలలో శ్రీమహాలక్ష్మీ సమేతుడై స్వామీ తులసీ ధాత్రి వనం లో ఉంటాడని చెప్తారు. పూర్వం కృతయుగం లో దేవదానవులు క్షీరమదనం చేసిన రోజు కనుక దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు ఒచ్చింది. పాల సముద్రాన్ని చిలికిన కారణం గా 'చిల్కు ద్వాదశి' అనికూడా పిలుస్తారు. స్త్రీలు ఈరోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీ ధాత్రి (తులసికోట) దగ్గర విశేష దీపారాదనలు చేసి షోడశోపచారాలతో తులసీ కళ్యాణం జరిపి, లక్ష్మీనారాయణులను పూజిస్తారు.సోమవారానికి ఎందుకంత ప్రాధాన్యత...?
కార్తికంలో సోమవారానికి ఎనలేని ప్రాధాన్యతఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్నినక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూరుడై ఈ నక్షత్రంమీద ఉండటం చేత సోమవారాలకు విశిష్టత కలిగింది. సోమ అంటే చంద్రుడు. శివుని సిగలో వెలిగే చంద్రుని వారం గనుకే సోమవార ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత. అదీగాక సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే భక్తులు ఈ మాసంలో సోమవారాలలో భక్తిశ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ‘హరహరశంభో’ అంటూ శివుణ్ణి స్తుతిస్తూ భక్తి సాగరంలో ఓలలాడతారు. సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించడం వల్ల సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో, ఆనందోత్సాహాలతో వర్థిల్లుతారని విశ్వాసం.
చాల చక్కటి సమాచారాన్ని అందించారు...! ధన్యవాదములు..!
ReplyDeleteచాల బాగుంది...! నాకు తెలియని కొన్ని విషయాలను తెలుసుకోగలిగాను...
ReplyDelete-శ్రీ వల్లి
సయంపాకం ఇచెటపుడు చేసుకొవలసిన సంకలపము దయచేసి తెలుపగలరు
ReplyDelete